01-11-2025 08:37:12 PM
మునిపల్లి,(విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో దేశ సైనికులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శనివారం నాడు రాత్రి మండలంలోని బుదేరా చౌరస్తాలో మండల బీజేపీ అధ్యక్షుడు నాగిశెట్టి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ సైనికులను కించపరిచే విదంగా పరుష పదజాలంతో మాట్లాడడం సిగ్గు చేటన్నారు. ఆపరేషన్ సింధూర్ చేసి దేశ గౌరవాన్ని పెంచి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించి ప్రపంచానికి మన దేశ సైనిక శక్తిని ప్రపంచానికి చెప్పిన మన దేశ సైనికులను సీఎం హోదాలో ఉండి కించపర్చడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్ దేశ సైనికులకు, దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు.