మోడీ సభకు బయలుదేరిన బీజేపీ నాయకులు
11-05-2026 01:13 AM
తాడ్వాయి, మే, 10( విజయ క్రాంతి): హైదరాబాదులోని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే ప్రధాని నరేంద్ర మోడీ సభకు బిజెపి నాయకులు తరలి వెళ్లారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నుంచి ఆదివారం బిజెపి నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... దేశంలో బిజెపి ప్రభంజనం కొనసాగుతుందని, తెలంగాణలో సైతం రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని తెలిపారు. తరలి వెళ్లిన వారిలో బిజెపి మండల అధ్యక్షులు సంతోష్ రెడ్డి,నాయకులు హోటల్ శ్రీను, గంగారెడ్డి, వెంకట్రావు తదితరులు ఉన్నారు.






