calender_icon.png 2 November, 2025 | 9:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు ప్రభుత్వం కాదు... రాక్షస ప్రభుత్వం

01-11-2025 06:13:44 PM

మద్యం మీద ఉన్న మక్కువ ధాన్యం మీద లేదు

బిజెపి మల్యాల మండల అధ్యక్షుడు గాజుల మల్లేశం

మల్యాల: తెలంగాణ రాష్ట్రంలో వరి కోతలు ప్రారంభమై నెలరోజులు గడిచిన ఇంతవరకు కొనుగోలు  కేంద్రాల్లో ధాన్యాన్ని తూకం వేయకపోవడం దారుణం అని ప్రస్తుతం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాదని అది రాక్షస ప్రభుత్వం అని అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతే ఆదుకోవాలనే సోయి కూడా లేదని మంత్రులు అందుకే జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల్లో బిజిగా ఉన్నారని బిజెపి మండల అధ్యక్షుడు గాజుల  మల్లేశం  విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రంలో మద్యం షాపులకు రెండు నెలల ముందే నోటిఫికేషన్ జారీ చేసి ఆశావాహుల నుండి ఆదాయం పొందడం కోసం గడువు పొడిగించిన ప్రభుత్వం రైతులు పండించిన పంట నెల రోజుల ముందే కోతకు వస్తుందని ఊహించి కొనుగోలు కేంద్రాలు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ఒకవేళ రైతుల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే వెంటనే ధాన్యాన్ని తూకం వేయించి తడిసిన రంగు మారిన మొలకెత్తిన ధాన్యాన్ని తరుగు తాలు  ఏలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మల్యాల ఆర్ఐ తిరుపతిగారికి వినతిపత్రం ద్వారా డిమాండ్ చేశారు.