01-11-2025 06:12:03 PM
జిల్లా న్యాయ సేవాధికర సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్..
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికర సంస్థ, హైదరాబాద్ ప్యాట్రన్ ఇన్ చీఫ్ ఆదేశాల మేరకు తేదీ:15.11.2025న తెలంగాణలోని అన్ని కోర్టులలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న NI యాక్ట్ కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, కుటుంబ తగాదాలు, మోటార్ వాహనాల కేసులు, పెండింగ్‌లో ఉన్న సివిల్ కేసులు, బ్యాంక్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి మరిన్ని పెండింగ్ కేసుల పరిష్కారం కోసం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి బి. పుష్పలత సూచనల మేరకు ఎఫ్ఎసి ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి కమ్ ఛైర్‌పర్సన్, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ, రాజన్న సిరిసిల్ల), 01.11.2025 శనివారం రోజున రాధిక జైస్వాల్, కార్యదర్శి, DLSA కె. సృజన I వ అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి కుమారి.జి. మేఘన, II వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పోలీసు అధికారులతో ప్రత్యేక లోక్ అదాలత్ పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎక్కువ కేసుల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు. జె.శ్రీనివాసరావు, లోక్ అదాలత్ సభ్యుడు భాస్కర్ లు పాల్గొన్నారు.