calender_icon.png 12 May, 2025 | 2:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ పార్టీ పటిష్ట వంతానికి కృషి చేయాలి

11-05-2025 06:55:00 PM

బీజేపీ సీనియర్ నాయకులు పైడి ఎల్లారెడ్డి

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): బీజేపీ పార్టీ పటిష్ట వంతానికి ప్రతి బీజేపీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ సీనియర్ నాయకులు పైడి  ఏల్లారెడ్డి అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో బీజేపీ కార్యాలయంలో ఫర్నిచర్ అందజేశారు. నూతనంగా మండల పార్టీ అధ్యక్షులుగా నియామకమైన వారిని సన్మానించారు. ఈ సందర్భంగా పైడి ఏల్లారెడ్డి మాట్లాడుతూ... బీజేపీ పార్టీని గ్రామ గ్రామాన పటిష్టవంతం చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించిన గెలిచే అభ్యర్థులను గుర్తించి టికెట్లు ఇప్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహులు, రాజేష్, శ్రీనివాస్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.