calender_icon.png 12 May, 2025 | 5:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలల మూసివేత తగదు

12-05-2025 01:30:33 PM

కలెక్టర్ కు విజ్ఞప్తి చేసిన టీపీజేఏసీ కో కన్వీనర్ 

మహబూబాబాద్, (విజయక్రాంతి): విద్యార్థులు పాఠశాలకు రావడంలేదని సాకుతో మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) వ్యాప్తంగా 144 పాఠశాలలను విద్యాశాఖ మూసివేసిందని, దీనివల్ల గిరిజన నిరుపేద పిల్లలు విద్యకు దూరమవుతున్నారని తెలంగాణ ప్రజల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ మైస శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అద్వైత్ కుమార్ సింగ్ కు ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంపై వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో 144 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూతపడ్డాయని, ఇందులో 123 పాఠశాలను పూర్తిగా గిరిజన ఆవాస ప్రాంతంలో ఉన్నాయన్నారు. గిరిజన పేద పిల్లలకు పాఠశాలల మూసివేతతో విద్య అందని ద్రాక్షగా మారిందని ఆరోపించారు. అలాగే జిల్లావ్యాప్తంగా అనేక పాఠశాలలో మౌలిక వసతులు కరువయ్యాయని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి ఆవాస ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఇచ్చిన హామీ మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు. వచ్చే విద్యా సంవత్సరం మూసివేసిన పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని, ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించి విద్యార్థులకు విద్యాబోధన సక్రమంగా జరిగేలా చూడాలని కోరారు.