11-05-2025 06:59:02 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూరు మండలం దామరంచ, రైతు నగర్ గ్రామాలలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. బోధన్ లయన్స్ క్లబ్ సెవెన్ హిల్స్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దామరంచ విండో చైర్మన్ కమలాకర్ రెడ్డి వైస్ చైర్మన్ దొంతురం గంగారం గ్రామస్తులు పాల్గొన్నారు.