12-05-2025 12:12:16 PM
21 వరకు రిజిస్ట్రేషన్
22 న వెబ్ ఆప్షన్లు, 29 సీట్ల కేటాయింపు
మహబూబాబాద్,(విజయక్రాంతి): కేసముద్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి ఈనెల 21 వరకు ‘దోస్త్’(Degree Online Services, Telangana) ద్వారా ఆన్లైన్లో విద్యార్థులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రిన్సిపల్ డాక్టర్ దాసు రాజు తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్ మార్కుల జాబితా, ఫోన్ నెంబర్ లింక్ చేసిన ఆధార్ కార్డు, కులము ఆదాయ మీసేవ ధ్రువీకరణ పత్రాలు, ఫోటో, సంతకం తో కూడిన దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించాలని తెలిపారు.
220 రూపాయలు రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకుంటే 22న వెబ్ ఆప్షన్ లకు అవకాశం కల్పిస్తామని, ఈనెల 29న సీట్ల కేటాయింపు ఉంటుందని ప్రిన్సిపల్ తెలిపారు. కేసముద్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ, ఎంపీసీ, ఎంపీసీఎస్, బిఎ కంప్యూటర్, బి జెడ్ సి, బి జెడ్ సి ఎస్, బీకాం కంప్యూటర్స్ కోర్సుల్లో 60 సీట్ల చొప్పున విద్యార్థులు చేరడానికి అవకాశం ఉందన్నారు. స్థానికంగా ఉన్నత విద్యను అభ్యసించే విధంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరడం వల్ల ఉచితంగా నాణ్యమైన విద్యా బోధన అందుబాటులో ఉన్నందున విద్యార్థుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.