calender_icon.png 12 May, 2025 | 6:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిట్స్ వాకర్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

12-05-2025 02:00:04 PM

హనుమకొండ,(విజయక్రాంతి): హసన్ పర్తి నల్లగుట్ట(Hasanparthy Nallagattu) ఎదరుగా మహాలక్ష్మి బ్లాంకెట్ హల్ లో మన కిట్స్ వాకర్స్ ఆధ్వర్యంలో రక్త దాన శిభిరం నిర్వహించారు. తలసేమియా వ్యాధి తో భాధపడుతున్న వారికి అభం శుభం తెలియని పసి పిల్లలు, ఈ వ్యాధితో పిల్లలకు రోజు రక్తం ఇవ్వకపోతే వెంటనే మరణిస్తారు. దీనికి మానవత్వంతో మన కిట్స్ వాకర్స్ దృష్టికీ వచ్చినందున వెంటనే స్పందించి రక్తదాన శిభిరం ఏర్పాటు చేశారు.

వాకర్స్ పిలుపుతో  స్పందించి రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన వారికి మన కిట్స్ వాకర్స్ తరుపున ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ డిప్యూటీ గవర్నర్ పావుశెట్టి శ్రీధర్ కవిత,  గూడూరు లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షులు పుల్ల దుర్గారామ్, ముఖ్య సలహాదారులు బోడ యుగంధర్, దూబల భాస్కర్, గంగినేని రవి కుమార్, వల్లాల శ్రీకాంత్, కనపర్తి రమేష్, వేల్పుల తిరుపతి, వేల్పుల సాయి,ధోనపాటి చంద్రకర్ రెడ్డి,ఎర్ర అశోక్, వీసం అనిల్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.