calender_icon.png 12 May, 2025 | 5:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్యాన్స్ కు షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ

12-05-2025 12:09:27 PM

ఇంగ్లాండ్ పర్యటనకు నెల రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండగానే భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్(Virat Kohli retires) ప్రకటించాడు. భారత క్రికెటర్ రోహిత్ శర్మ(Indian cricketer Rohit Sharma) తన ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన కొన్ని రోజుల తర్వాత 36 ఏళ్ల కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. శనివారం తెల్లవారుజామున కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ నిర్ణయం గురించి బీసీసీఐకి తెలియజేసినట్లు వార్తలు రావడంతో దిగ్భ్రాంతికి గురయ్యాడు.

సోషల్ మీడియాలో చర్చ జరిగినట్లే టెస్టు క్రికెట్ కు విరాట్ కోహ్లీ(Virat Kohli) సోమవారం గుడ్ బై చెప్పాడు. 14 ఏళ్ల పాటు భారత్ తరుఫున కోహ్లీ ప్రాతినిధ్యం వహించాడు. తన కెరీర్ లో 123 టెస్టు మ్యాచులు ఆడిన విరాట్ 9,230 పరుగులు చేశాడు. 2011 లో వెస్ట్ ఇండీస్ పై కోహ్లీ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 2025 జనవరి 3న కోహ్లీ ఆస్ట్రేలియాతో చివరి టెస్టు మ్యాచ్ ఆడారు. టెస్టు కెరీర్ లో 30 శతకాలు, 31 అర్ధ శతాలు సాధించారు. టెస్టుల్లో 46.8 సగటుతో 9230 పరుగులు చేసిన విరాట్, సచిన్ టెండూల్కర్ (15,921), రాహుల్ ద్రవిడ్ (13265), సునీల్ గవాస్కర్ (10122) తర్వాత టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన నాల్గవ ఆటగాడిగా నిలిచిన కోహ్లీ ఫార్మాట్ నుంచి వైదొలగడానికి ఇదే సరైన సమయం అని భావించినట్లు తెలుస్తోంది.