విలువలతో కూడిన విద్య నేర్పిండ్రు
60 విద్యార్థులకు సైకిళ్లు..
మంత్రి వాకిట శ్రీహరి, ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
కౌకుంట్ల ఏప్రిల్ 19: విలువలతో కూడిన విద్య నేర్పించాలని ప్రతి ఒక్కరు ఉన్నత శిఖరాలను అధిరోహించి అందరికీ ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకిట శ్రీహరి అన్నారు. ఆదివారం కౌకుంట్ల మండలం పేరూరు గ్రామంలో జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల 75 ఏళ్ల డైమండ్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ నేర్చుకున్న చదువు నేర్పిన గురువు ప్రతి వ్యక్తి జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు.
నాటి నుంచి నేటి వరకు ఎంతో మంది గురువులు మరి ఎంతోమంది విద్యార్థులను క్రమశిక్షణతో విద్య నేర్పించి వారికి మంచి భవిష్యత్తును అందించారని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ వివిధ గ్రామాల నుంచి పాఠశాలకు వచ్చే 60 మంది విద్యార్థులకు కొత్త సైకిళ్లు అందజేశారు. విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వులు ఆనందం వెల్లువెరిసింది.
విద్యా సేవలకు సలాం.. ఎమ్మెల్యే జిఎంఆర్
విద్య గురించి తెలియని ఆ రోజుల్లో, 1950లో పేరూరు గ్రామ పెద్దలు, మాజీ జిల్లా జడ్పీ చైర్మన్ కె.కె. రెడ్డి సేవలు అమోఘమని ఎమ్మెల్యే జి మధు సుదన్ రెడ్డి అన్నారు. వారి కృషి ఫలితంగానే ఈ పాఠశాల ఏర్పడిందని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పిన జిఎంఆర్ పేరూరు పాఠశాలలో మ్యాథమెటిక్స్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని, మినీ స్టేడియం మంజూరు చేయాలని మంత్రి శ్రీహరిని కోరారు.
సానుకూలంగా స్పందించిన మంత్రివర్యులు, ‘పేరూరు గ్రామానికి మినీ స్టేడియం తప్పకుండా మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ శృతి అరవింద రెడ్డి, గ్రామ పెద్దలు బసి రెడ్డి తదితరులతో కలిసి పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జిఎంఆర్) పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.






