23 July, 2026 | 1:49 AM

హుస్నాబాద్‌లో బీజేపీ ధర్నా

23-07-2026 12:10 AM

పలువురు నాయకుల అరెస్ట్

హుస్నాబాద్, జూలై 22: కాంగ్రెస్ పార్టీ విధానాలను నిరసిస్తూ బుధవారం హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి పలువురు నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించారు.

అనంతరం కొందరు బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీల దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ, కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. దీంతో అంబేద్కర్ చౌరస్తా వద్ద కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.