calender_icon.png 19 January, 2026 | 8:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపాలిటీ సమస్యలపై బీజేపీ నిరసన

19-01-2026 03:46:37 PM

లక్షెట్టిపేట టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమ వారం గాంధీ చౌక్ నుంచి మున్సిపాలిటీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి మున్సిపాలిటీ కమిషనర్ కి లక్షెట్టిపేట బీజేపీ శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ లక్షెట్టిపేట మున్సిపాలిటీలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

మున్సిపాలిటీలో మిషన్ భగీరథ పైప్ లైన్ లు పగిలి డ్రైన్ వాటర్ పైపుల్లోకి చేరి ఇళ్లలోకి వస్తుందని, వాటిని తాగునీటిగా వాడడంతో ప్రజలు తీవ్ర అస్వస్థత కు గురవుతున్నారన్నారు. మున్సిపాలిటీలో చెత్త సేకరణ సరిగ్గా చేయకపోవడం, నాలీల్లో మురుగు నీరు జమై దోమలు వృద్ధి చెంది ప్రజలు వ్యాధుల భారిన పడుతున్నారన్నారు. మున్సిపాలిటీలో అత్యధిక టాక్స్ లు వసూలు చేస్తున్నారు, కానీ అందుకు తగిన వసతులు మాత్రం ఏర్పాటు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.