calender_icon.png 15 November, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీహార్ ఎన్నికల్లో విజయంపై బీజేపీ శ్రేణుల సంబురాలు

15-11-2025 01:23:41 AM

నిజామాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): బిహార్ రాష్ట్ర  అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వం లోని ఎన్ డి ఎ కూటమి ఘన విజయం సాధించడం పట్ల శుక్రవారం రోజు నిజామాబాద్ జిల్లా కోర్టు ఎదుట  లీగల్ సెల్ న్యాయవాదులు  టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకుని ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు.

ఈ సంద ర్భంగా న్యాయమాత పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపూల  జగన్మోహన్ గౌడ్ మాట్లా డుతూ బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో 200 స్థానాలకు విజయం సాధించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం లో చ చేపడుతున్న టువంటి అభివృద్ధికి  బీహార్ ప్రజలు బీజేపీ  మరొకసారి పట్టం కట్టిన  బిజెపి పట్ల ప్రజల విశ్వాసాన్ని పొందినట్లుగా భావిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ ప్రజల  విశ్వాసాన్ని  పొందలేదని అభివృద్ధిని ప్రజలు ఆకాంకించారని.

ఈ విజయం విహార్ ప్రజలకి అంకితం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ న్యాయవాదులు బిట్ల రవి వసంతరావు మాణిక్ రాజ్ రుయాడి రాజేశ్వర్  సంతోష్ నాగ్ రేంజర్ల సురేష్ రంజిత్ సుతారి జయప్రకాష్‌లో హియ మృత్యుంజయ శర్మ పాల్గొన్నారు.

ఎల్లారెడ్డి .. 

ఎల్లారెడ్డి, నవంబర్14(విజయ క్రాంతి): బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి కూటమి ఎన్ డి ఏ ఘనమైన విజయాన్ని సాధించింది. బిజెపి పార్టీ మ్యాజిక్ ఫిగర్ ని కూడా సాధించిందని ఇప్పుడు దేశంలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. 243 స్థానాల్లో ఎన్ డి ఏ కూటమి 207 పైచిలుకు స్థానాల్లో లిడ్ లో ఉంటే దానిలో,బీజేపీ,95 ,జేడీ యూ 83ఎల్ జె పి 23 స్థానాల్లో మెజార్టీ కనపరుస్తుందనీ,

ఎల్లారెడ్డి బీజేపీ నాయకులు రాస్తకార్యవర్గ సభ్యులు,బత్తిని దేవనేదర్,మర్రి బాలకిషన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదు స్థానాల్లో మెజార్టీ కనపరుస్తుంది.పట్టుమని 5స్థానాల్లో కూడా నెగ్గలేనటువంటి పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ దిగజారింది అని అంటే దేశంలో ప్రజల్లో సముచిత స్థానాన్ని నమ్మకాన్ని కోల్పోయినట్లే అని

రానున్న ఎన్నికలలో ,కర్ణాటక మరియు తెలంగాణలో* కూడా ఈ విధమైనటువంటి ఫలితమే రానుంది అని చెప్పి బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్,అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలకిషన్,బిజెపి పట్టణ అధ్యక్షుడు రాజేష్, మండల అద్యక్షులు నర్సింలు, మాజీ ప్రధాన కార్యదర్శి నరేష్ పికె, మండల ఉపాధ్యక్షులు రాములు, కాశీనాథ్ మాజీ పట్టణ అధ్యక్షుడు సతీష్, ప్రధాన కార్యదర్శులు శంకర్, అశోక్, పద్మశ్రీను,శివ,st మోర్చ రాజు, అల్లంపండరి,  శివ, గంగన్న, బాలరాజు , గజనంద్ తదితరులు పాల్గొన్నారు. 

నిజామాబాద్.. 

నిజామాబాద్ నవంబర్ 14: (విజయక్రాంతి): బీహార్ ఎన్నికలో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించినందుకు  మధ్యాహ్నం  బిజెపి జిల్లా పార్టీ కార్యాలయం నుండి  దేవి టాకీస్ చౌరస్తా వద్ద సంబరాలు జరుపుకున్నారు. 

బిజెపి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు  దినేష్ పటేల్ కులాచారి  నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ  లక్ష్మీనారాయణ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.  పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు.