15-11-2025 01:21:16 AM
నిజామాబాద్ నవంబర్ 14: (విజయ క్రాంతి). నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ని జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేసి సోదాలు జరిపారు . నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు జరపడం ఉద్యోగుల్లో వణుకు పుట్టుకుంది. మధ్యాహ్నం సమయంలో కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు ఆఫీసులో రికార్డులతో పాటు రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లను వివరాల పట్టికలను క్షుణ్ణంగా క్షుణ్ణంగా పరిశీలించారు.
రిజిస్టర్ కార్యాలయంలోని అధికారులు, సిబ్బందిని విచారించడంతో పాటు పూర్తి వివరాలను రాబడుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయ నీ చేతులు తడపందే ఏ పని జరగడం లేదనే ఆరోపణల దృష్ట్యా ఈ దాడులు నిర్వహించారు.
సిబ్బంది పనితీరుపై తీవ్ర విమర్శలు ఎత్తడంతో సమాచారం అందుకున్న అధికారులు దాడులు నిర్వహించి వివరాలు రాబడుతున్నారు.ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు .. ఎవరైనా ఫిర్యాదు చేస్తే గాని దాడి చేశారా..? లేక ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారా అనే విషయం లో స్పష్టత రాలేదు. సోదాల అనంతరం పూర్తి వివరాలు వెల్లన వెల్లడించ ఉన్నారు.