calender_icon.png 14 September, 2025 | 9:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశవ్యాప్త ‘తిరంగా యాత్ర’కు బీజేపీ సిద్ధం

13-05-2025 01:18:42 AM

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో చేపట్టాలని నిర్ణయం

మే 13 నుంచి 23 వరకు 

న్యూఢిల్లీ, మే 12: ఆపరేషన్ సిందూర్ విజయవంతంతో బీజేపీ నాయకత్వం ఫుల్ జోష్‌లో ఉంది. ప్రధాని మోదీకి ఆయన ప్రభుత్వానికి ఈ ఆపరేషన్ మరింత మైలేజ్ తీసుకొచ్చిందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యా ప్తంగా తిరంగా యాత్ర చేపట్టేందుకు సిద్ధం అయ్యారు. మంగళవారం నుంచి ఈ నెల 23వరకు తిరంగా యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు.

ఈ యాత్రపై చర్చించేందుకు కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా తదితరులు ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జేపీ నడ్డా సోమవారం కూడా పార్టీ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, వినోద్ తావ్డే, దుశ్యంత్ గౌతమ్ వంటి నేతలతో సమావేశమై ఏర్పాట్ల గురించి చర్చించారు. రాజకీయ పరంగా కాకుండా ఆపరేషన్ సిందూర్‌పై సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను చైతన్యవంతం చేసేలా ఈ యాత్ర ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.