calender_icon.png 14 October, 2025 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశాఖలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుపై ప్రధాని మోదీ హర్షం

14-10-2025 03:31:54 PM

గూగుల్ ఏఐ హబ్ బలమైన శక్తిగా పనిచేస్తోంది: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు పట్ల ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) హర్షం వ్యక్తం చేశారు. గూగుల్ ఏఐ హబ్ బలమైన శక్తిగా పనిచేస్తోందని ప్రధాని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా డేటా సెంటర్ వస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరికీ ఏఐ అందుబాటులోకి వస్తుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. డిజిటల్ ఎకానమీకి మరింత ఊపునిస్తుందని నరేంద్ర మోదీ తెలిపారు. గ్లోబల్ టెక్నాలజీ లీడర్ గా భారత్ స్థానం మరింత సుస్థిరమని స్పష్టం చేశారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పోస్టుపై ప్రధాని మోదీ స్పందించారు. 

విశాఖపట్నంలో కంపెనీ మొట్టమొదటి గూగుల్ ఏఐ హబ్( Google AI Hub in Visakhapatnam) గురించి వివరాలను గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మంగళవారం పంచుకున్నారు. ఈ ప్రాజెక్టు గురించి తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చర్చించానని, ఇది ఏఐ ఆవిష్కరణలను వేగవంతం చేయడంలో, భారత్ అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఎలా సహాయపడుతుందో హైలైట్ చేశానని పిచాయ్ చెప్పారు. ఇది ఆంధ్రప్రదేశ్, భారతదేశానికి అతిపెద్ద సాంకేతిక మైలురాళ్లలో ఒకటి నిలుస్తోందని గూగుల్ సీఈఓ పేర్కొన్నారు.  విశాఖపట్నంలో రూ. 87,520 కోట్ల (USD 15 బిలియన్లు) పెట్టుబడితో ప్రపంచ స్థాయి ఏఐ-ఆధారిత డేటా సెంటర్‌ను స్థాపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం న్యూఢిల్లీలో గూగుల్‌తో ఒప్పందం (MoU)పై సంతకం చేసింది.