17 May, 2026 | 7:51 AM

తెలంగాణలో బీజేపీ సొంతంగా అధికారంలోకి రావాలి

26-08-2024 08:14 AM

ఏపీ మంత్రి సత్యకుమార్

హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి: తెలంగాణలో బీజేపి సొంతంగా అధికారంలోకి రావాలని ఏపీ మంత్రి సత్యకుమార్ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సొంతంగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు అవిశ్రాంతంగా పనిచేయాలని మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం  హైద రాబాద్‌లో టీబీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ నివాసంలో ప్రధాని మోదీ మన్‌కీబాత్ కార్యక్రమాన్ని పార్టీ నేతలతో కలిసి ఆయన వీక్షించారు. ఈ సంద ర్భంగా పార్టీ బలోపేతంపై నేతలు, కార్యకర్తలతో ఆయన మాట్లాడారు.

బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కలలను సాకారం చేయడానికి కార్యకర్తలంతా కృషి చేయాలన్నారు. మన్‌కీబాత్‌తో తెలుగు భాష ప్రాముఖ్యాన్ని ప్రధా ని పొగడటమే కాకుండా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేయడం అభినందనీయమని అన్నారు.ప్రధానీ మోదీ ఆధ్వర్యంలో దేశం సాధించిన విజయాలను ప్రజలకు తెలియచేస్తూ బీజేపీని మరింత బలంగా తయారు చేయాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు.