13 July, 2026 | 2:17 AM

పేదల ఆరోగ్యానికి పెద్దపీట

13-07-2026 01:58 AM

అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్

నిమ్స్ వైద్య చికిత్సకు ఎల్వోసీ అందజేత

ఇందూరు, జూలై 12 (విజయక్రాంతి): నియోజకవర్గంలోని పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని, అవసరమైన వారికి నిమ్స్‌లో ఎల్వోసీ అందజేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని కార్యాలయంలో ఆదివా రం ఎల్వోసీ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఎల్‌ఓసీ ఇప్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళుతు న్నట్లు తెలిపారు. నగరంలోని ఆటో నగర్‌కు చెందిన మూడున్నరేళ్ల బాలిక ఉమ్మే కుర్సుం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారన్నారు. దీంతో నిమ్స్‌లో చికిత్స కోసం రూ.ఐదు లక్ష ల ఎల్వోసీ వారి కుటుంబ సభ్యులకు అందజేశామన్నారు. పార్టీలకతీతంగా పేదల ప్రాణాలను కాపాడటమే తన లక్ష్యమన్నారు. నియోజకవర్గ ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియం చేసుకోవాలని కోరారు.