ఆరు గ్యారెంటీల అమలు కోరుతూ బీజేపీ ధర్నా
17-03-2026 01:48 AM
భిక్కనూర్, మార్చి16 (విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భిక్కనూర్ మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు. మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్ నాయకత్వంలో చేపట్టిన ఈ నిరసనలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఆర్‌ఐకి వినతిపత్రం అందజేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, ఆసరా పెన్షన్లు, రైతు భరోసా, గృహ నిర్మాణ పథకం తదితరాలను ప్రభుత్వం ఇప్పటికీ పూర్తిగా అమలు చేయలేదని వారు ఆరోపించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అత్తిల్లి తిరుమలేష్, రంజిత్, నరేందర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, యాదగిరి గౌడ్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.




