08-12-2025 01:38:41 AM
రెండేళ్ల పాలనలో అమలుకాని హామీల బొమ్మలకు ఉరి
హైదరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజ ల పరిస్థితి ఏం మారలేదని బీజేపీ తెలిపింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్క టి కూడా అమలు కాలేదని విమర్శించిం ది. ఇందులో భాగంగానే ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో బీజేపీ చేపట్టిన మహాధర్నాలో వినూత్న నిరసనను చేపట్టింది.
బిల్లులు రాక సర్పంచ్‌ల ఆత్మహ త్యలు, యువతులకు స్కూటీలివ్వ డం, మహిళలకు రూ.2500 పింఛన్ అమలు, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఈ రెండేళ్ల పాలనలో అమలు కాలేదని తెలిపేలా వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఉరి వేసుకున్నట్లుగా బొమ్మలను చెట్టుకు వేలాడదీశారు.
స్కూటీని సైతం చెట్టుకు వేలాడ దీశారు. తులం బంగారం కాకి ఎత్తుకు పోయిందని, రూ.2500 నోటు ఉన్న ఫ్లకార్డులను చెట్టుకు తాళ్లతో కట్టారు. ఈ వినూత్న నిరసన.. వచ్చని పార్టీ శ్రేణులు, ప్రజలకు ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీ చేపట్టిన భారీ మహాధర్నాకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇందిరాపార్కు అంతా కాషాయమయం అయింది. మరోవైపు ఈ ధర్నాకు బీజేపీ ముఖ్య నేతలు తమ వ్యక్తిగత కారణాలతో హాజరుకాలేదని రాంచందర్ రావు మీడియాకు తెలిపారు.