calender_icon.png 9 December, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుకోవాలి

08-12-2025 01:38:44 AM

ఎంపీడీవో వెంకయ్య గౌడ్

శంకర్‌పల్లి, డిసెంబర్ 7(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని ఎంపీడీవో వెంకయ్య కోరారు.ఆదివారం శంకర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో  సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థులచే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నియామవళి ప్రకారం గ్రామానికి పంచాయతీ సర్పంచే పునాది లాంటిదన్నారు. గ్రామ ప్రజలకు అభివృద్ధి చేసే వ్యక్తిని ఎన్నుకునే విధంగా చెయ్యాలి తప్ప   వ్యక్తిగత కక్షలకు దూరంగా  ఉండాలన్నారు.

గెలుపోటములు సహజమని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అందరూ కలిసిమెలిసిగా ఉండాలని  ఆయన సూచించారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ప్రతి సర్పంచ్ అభ్యర్థి ఒక ఏజెంటును నియమించుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రచార సమయంలో గుర్తింపు కార్డును ఇస్తామని వాహనాల అనుమతిని తహసిల్దార్ లేదా సిఐలు ఇవ్వడం జరుగుతుందన్నారు. మద్యం డబ్బులు పంచకుండా అదే విధంగా వ్యక్తిగత ద్వేషాలకు పోవద్దని సూచించారు. 

సిఐలు శ్రీనివాస్ గౌడ్, వీరబాబు గౌడ్ మాట్లాడుతూ శాంతి భద్రతలకు ఎలాంటి విగాథము కలకుండా ఎన్నికలు జరుపుకోవాలన్నారు. 

ఎవరు కూడా ఓటర్లను బెదిరించడం కానీ భయపెట్టడం అని చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల ప్రచార రథం అవసరం అనుకుంటే తహసీల్దారు నుండి పర్మిషన్ తీసుకోవాలన్నారు.

మైకుల పర్మిషన్ కావాలంటే ఏసీపీ అడ్రస్ చేసుకుంటూ లెటర్ చేస్తే పర్మిషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామన్నారు. గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీ కోసం రెండు రోజుల ముందు (48  గంటలు ముందు) దరఖాస్తు చేసుకుంటే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అన్నారు.