calender_icon.png 7 May, 2025 | 5:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రమూకల దాడిపై భగ్గుమన్న బీజేవైఎం

24-04-2025 01:21:00 AM

కరీంనగర్, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి): జమ్మూ కాశ్మీర్లో ని పహల్గాం ఉగ్రదాడిపై భారతీయ జనతా యువమోర్చా కరీంనగర్ జిల్లా శాఖ భగ్గుమంది. బుధవారం కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ ఉగ్ర మూకల దాడిని నిరసిస్తూ  దిష్టిబొమ్మ దహనం చేశారు.

ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దురిశెట్టి సంపత్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో ప్రజలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో వహల్గాం ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు.  , మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని  తెలియజేస్తున్నట్లు చెప్పారు. దాడి ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అవినాష్,జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు తోట సాయి, సంపత్, అనిల్, అజయ్, పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ ఉప్పారపల్లి శ్రీనివాస్, నాగసముద్ర ప్రవీణ్, శశికుమార్, జిల్లా కార్యదర్శిలు విజయ్, కుమార్, మహేశ్, జిల్లా అధికార ప్రతినిధిలు రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సమరసింహరెడ్డి, శివారెడ్డి, సంపత్, జోన్ అధ్యక్షులు పొన్నాల రామ్, వంశీకృష్ణ, సతీష్, వినయ్, కరుణాకర్, ప్రవీణ్, రాజ్, అజయ్, చందు, వినయ్, వెంకటేష్ లు పాల్గొన్నారు.