calender_icon.png 4 May, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య’

24-04-2025 01:20:45 AM

న్యాయశాఖ ఉద్యోగుల సంఘీభావం

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): జమ్మూకశ్మీర్ పహల్ గామ్ ఉగ్రదాడి పరికిపంద చర్య అని న్యాయశాఖ ఉద్యోగుల సంఘం సభ్యులు పేర్కొన్నారు. సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎస్‌వీ సుబ్బయ్య ఆధ్వర్యంలో ఉగ్రదాడిని బుధవారం ముక్తకంఠంతో ఖండించారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు ఎస్‌వీ సుబ్బయ్య మాట్లాడుతూ.. మానవతా విలువలకు తిలోదకాలు వదులుతూ జరిగిన ఈ పైశాచిక దాడిని, యావత్ భారతీయులపై జరిగిన దాడిగా భావించాలని, భారతావని ప్రజలందరూ ఏకం కావాలని సూచించారు.  కార్యక్రమంలో సిటీ సివిల్ కోర్టు న్యాయశాఖ ఉద్యోగులందరూ పాల్గొన్నారు.