మోడల్ స్కూల్ హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు, ప్లేట్లు పంపిణీ
08-08-2026 12:09 AM
కేసముద్రం, ఆగస్టు 7 (విజయక్రాంతి) : కేసముద్రం మండలం కల్వల మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ లో విద్యార్థినిలకు ప్రభుత్వం నుండి సమకూర్చిన ప్లేట్లు, దుప్పట్లను జి సి డి వో గాయత్రి, ప్రిన్సిపల్ నవీన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పేదల విద్యాభివృద్ధి కోసం అమలు చేస్తున్న కార్య్ర కమాలను సద్వినియోగం చేసుకుని చక్కగా చదువుకొని ఉజ్వల భవిష్యత్తు అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు.






