8 August, 2026 | 1:16 AM

భక్తిశ్రద్ధలతో మోర్గిలో బోనాల ఉత్సవాలు

08-08-2026 12:09 AM

నాగలిగిద్ద, ఆగస్టు 7 (విజయక్రాంతి) : మండల పరిధిలోని మోర్గి గ్రామంలో శుక్రవారం ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను గ్రామస్తులు, మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలను ఎత్తుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ స్థానిక మరియమ్మ ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లారు.

పోతురాజుల విన్యాసాలు, యువకుల నృత్యాలు, మహిళల భక్తిగీతాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్గే అన్నపూర్ణ శివశరణప్ప, మాజీ ఎంపీటీసీ కీర్తి నందు పటేల్, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.