లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
మహబూబ్నగర్, ఆగస్టు 7 (విజయక్రాంతి) : పశుసంవర్ధక శాఖ అమలు చేస్తున్న అన్ని పశు వైద్య కార్యక్రమాలను, పశుసంరక్షణ సేవల లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా పశువైద్య అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టర్ కార్యాలయం సమావేశం మందిరంలో నిర్వహించిన జిల్లా పశుసంవర్ధక శాఖ త్రైమాసిక సమీక్ష సమావేశంలో కలెక్టర్ పాల్గొని మండలాల వారీగా కృత్రిమ గర్భధారణ (, టీకాల కార్యక్రమం, డీ-వార్మింగ్, పశువుల కాస్ట్రేషన్, గడ్డి విత్తనాల పంపిణీ తదితర కార్యక్రమాల పురోగతిని పశు వైద్య అధికారులతో సమీక్షించారు. రానున్న రెండు నుంచి మూడు నెలల్లో అన్ని కార్యక్రమాలను 100 శాతం పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వెటర్నరీ వైద్య అధికారి డా. జి. శివేంద్రస్వామి, సహాయ సంచాలకులు డా. బాలాజీ, మండల పశువైద్య అధికారులు, గోపాలమిత్రలు, పారా వెటర్నరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






