రంజిత్‌రెడ్డిని దీవించండి
09-05-2024 01:19 AM
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
వికారాబాద్, మే 8 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల్లో తనను దీవించినట్టే పార్లమెంట్ ఎన్నికల్లో రంజిత్‌రెడ్డిని గెలిపించాల ని వికారాబాద్ ఎమ్మెల్యే, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఓటర్లను కోరారు. బుధవారం ఆయన వికారాబాద్ మండలంలోని మైలార్‌దేవరంపల్లిలో నిర్వహిం చిన రోడ్ షోలో ప్రసంగించారు. కేంద్రం లో కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే పేదలకు మేలు జరుగుతుం దని చెప్పారు. బీజేపీ ధనికుల పార్టీ అని, గొప్పోళ్లకు మాత్రమే మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు. కాంగ్రెస్ బడుగు, బలహీన వర్గాల కోసం ఆలోచిస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని తెలిపారు.




