రక్తదానం మనిషి చేయగలిగే అత్యంత గొప్ప సేవ
* బ్యాంకు మేనేజర్ శివప్రశాంత్
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్
కొత్తగూడెం, డిసెంబర్ 5, (విజయక్రాంతి): రక్తదానం మనిషి చేయగలిగే అత్యంత గొప్ప సేవని హెచ్డీఎఫ్సీ బ్యాం క్ కొత్తగూడెం బ్రాంచ్ మేనేజర్ శివప్రశాంత్ అన్నారు. శుక్రవారం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆవరణలో, మెగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాజిక బాధ్యతగా హెచ్డీఎఫ్సీ బ్యాం క్ ప్రతీ ఏటా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహిస్తోందని అన్నా రు. రక్తం ఇవ్వడం ద్వారా ఒకరి ప్రా ణాన్ని కాపాడే అవకాశం లభిస్తుందని తెలిపారు.
సమాజహితం కోసం అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సామాజిక బాధ్యతలో భాగంగా ఇలాంటి సేవ కార్యక్రమాలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. తొలుత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్తగూడెం బీఎం శివప్రశాంత్ స్వయంగా బ్లడ్ డొనేట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (ఆపరేషన్స్) మేనేజర్ కొత్త వంశీ, జి.మనోజ్ కుమార్, లెక్కల సంపత్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆర్.ఎం. మేక శ్రీకాంత్, అగ్రి డిపార్ట్మెంట్ క్లస్టర్ హెడ్ కోటేశ్వరరావు, క్రెడిట్ కార్డ్ అసిస్టెంట్ మేనేజర్ యెర్రా లింగేష్, ట్రాక్టర్ లోన్స్ ఎస్‌ఎం అరుణ్ కుమార్, అగ్రి డిపార్ట్మెంట్ ఎస్‌ఓ ఉపేంద్ర, యెర్రా సర్వేష్, బ్యాంకు సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






