9 March, 2026 | 12:13 PM

స్టాటిక్ సర్వేలెన్స్ చెక్‌పోస్టును సందర్శించిన ఎస్పీ రోహిత్ రాజు

06-12-2025 12:00 AM

భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 5, (విజయక్రాంతి):పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి ప్రకారం జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పరిశీలించారు.రేగళ్ల గ్రామంలోని పంచాయతీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని శుక్రవారం ఎస్పీ సందర్శించారు. అక్కడ విధులలో ఉన్న పోలీస్ అధికారులు,ఎన్నికల అధికారులను నామినేషన్ ప్రక్రియ సరళిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఇల్లందు క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు చేపడుతున్న స్టాటిక్ సర్వేలేయన్స్ చెక్పోస్టును సందర్శించారు. అక్కడ వాహన తనిఖీల వివరాల రిజిస్టర్ ను ఎస్పీ తనిఖీ చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా నగదు, మద్యం, మరే ఇతర వస్తువులను అక్రమ రవాణాకు ప్రయత్నించే వారిపై ఎన్నికల నియమావళి ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి,అట్టి వాహనాల వివరాలను కచ్చితంగా నమోదు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన అన్ని చెక్పోస్టుల వద్ద నిత్యం వాహన తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో చుంచుపల్లి సిఐ వెంకటేశ్వర్లు, లక్ష్మిదేవిపల్లి ఎస్త్స్ర రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు