calender_icon.png 12 December, 2025 | 1:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో బీఎంఎస్

10-12-2025 02:46:31 AM

  1. నూతన రాష్ర్ట కార్యాలయం ఏర్పాటు
  2. 25న ‘దత్తోపంత్ ఠేంగ్డే భవన్’ను ప్రారంభించనున్న ఆర్‌ఎస్‌ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే
  3. అదే రోజు బాగ్‌లింగంపల్లిలో బహిరంగ సభ

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 9 (విజయక్రాంతి): అంతర్జాతీయ ఖ్యాతి గాంచి న ప్రముఖ కార్మిక సంఘం భారతీయ మజ్దూర్ సంఫ్‌ు తన నూతన రాష్ర్ట కార్యాలయ భవనాన్ని ప్రారంభించుకునేందుకు సిద్ధమైంది. ఈ నెల 25వ తేదీన బుధవారం దత్తోపంత్ ఠేంగ్డే భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నట్లు బీఎంఎస్ రాష్ర్ట అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తూర్పు రాంరెడ్డి ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, మెట్రో పిల్లర్ నెం 39 పక్కన, స్ట్రీట్ నెంబర్ 9లో ఉన్న పాత కార్యాలయం స్థానంలోనే ఈ నూతన భవనాన్ని నిర్మించారు.

ఈ భవన ప్రారంభోత్సవానికి ఆర్ ఎస్‌ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నూతన భవన ప్రారంభం అనంతరం బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బీఎంఎస్ అఖిల భారత మాజీ అధ్యక్షుడు భాగయ్య, అతిథులుగా బీఎంఎస్ అఖిల భారత అధ్యక్షుడు హిరణ్మయి పాండ్య, ప్రధాన కార్యదర్శి రవీంద్ర హింటే, సంఘటన కార్యదర్శి బి. సురేంద్రన్ తదితరులు హాజరుకానున్నారు.