10-12-2025 02:47:58 AM
రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ
ఖైరతాబాద్ డిసెంబర్ 9 (విజయక్రాంతి) : ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలుచేయక కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్స్ జెఏసి నేతలు ఆరోపించారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్స్ జెఏసి హైదరాబాద్, ఖైరతాబాద్, ఆర్.టి.ఏ కమిషనర్ కార్యాలయం ఎదుట మంగళవారం భారీ ధర్నా నిర్వహించింది.
ఈ ధర్నా లో జేఏసీ కన్వీనర్ వెంకటేశం,జెఏసి నేతలు ఎల్.రూప్ సింగ్, ఏం.ఏ. సలీం, ప్రవీణ్, వేముల మారయ్య, సత్తి రెడ్డి,యాదగిరి, శ్రీనివాస్ లతోపాటు వందలాదిమంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ వెం కటేశం మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభు త్వం తమ ఎన్నికల మానిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఆటో డ్రైవర్ కు రూ. 12 వేల ఆర్థిక సహాయం, రవాణారంగా కార్మికులకు సంక్షేమ బోర్డు వంటి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఫుర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
గత 13 సంవత్సరాల నుండి ఇప్పటివరకు ఆటో మీటర్ చార్జీలు పెంచలేదని తెలిపారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువులు 100% పెరిగాయని అన్నారు. దీంతో ఆటో డ్రైవర్లు దిక్కుతోచని స్థితిలో తమ జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్.రూప్ సింగ్. ఏం.ఏ. సలీం, వేముల మారయ్య, ఈ. ప్రవీణ్, జి. శ్రీనివాస్, ఏ. సత్తిరెడ్డి, పీ.యాదగిరి తదితరులు పాల్గొన్నారు.