12 July, 2026 | 2:53 PM

Breaking News

చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •  

మూడు మున్సిపాలిటీల పరిధిలో పకడ్బందీగా బీఎన్‌ఎస్ 163 అమలు

13-02-2026 12:00 AM
  1. ఎలాంటి సభలు, సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు

ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు: ఎస్పీ రోహిత్ రాజు

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 12, (విజయక్రాంతి): శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

ఎన్నికల నియమావళి ప్రకారం సభలు, సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని తెలిపారు. డీజేల వినియోగం,బాణాసంచా కాల్చడం వంటివి కూడా నిషేధమని తెలియయజేశారు.నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్ట్రాంగ్ రూంల వద్ద  పటిష్ట భద్రత ఉంటుందని అన్నారు.ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిసర ప్రాంతాలను డాగ్ స్క్వాడ్,బాంబుస్క్వాడ్స్ తో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో పకడ్బందీగా 163 BNSS అమలులో ఉంటుందని అన్నారు.

అభ్యర్థులు, ఏజెంట్లు లెక్కింపునకు హాజరయ్యే అధికారులు నిషేధిత వస్తువుల అయిన అగ్గిపెట్టెలు, లైటర్, ఇంక్ బాటిల్స్, పేలుడుకు కారణమయ్యే ఎలాంటి  వస్తువులను లెక్కింపు కేంద్రాల్లోకి తీసుకురాకూడదని తెలిపారు. తనిఖీలు చేసే పోలీసు సిబ్బందికి సహకరించాలని  కోరారు. ఎన్నికల అధికారులు జారీ చేయబడిన గుర్తింపు కార్డులు ఉన్న వారికి మాత్రమే లెక్కింపు కేంద్రంలోకి అనుమతి ఉంటుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.