calender_icon.png 13 February, 2026 | 11:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి

13-02-2026 12:00:00 AM

విద్యుత్ సవరణ బిల్లు 2025ని వెనక్కి తీసుకోవాలి

వీబీజీ రాంజీ చట్టం, విత్తన సవరణ బిల్లును వెంటనే సంహరించుకోవాలి

సిద్దిపేట జిల్లా కేంద్రంలో సమ్మెలో కార్మిక సంఘాల డిమాండ్

సిద్దిపేట, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని, విద్యుత్ రంగంలో తీసుకొస్తున్న నూతన చట్టాన్ని, ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో తెస్తున్న వి బి జి రాంజీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, విత్తన సవరణ బిల్లును, ఎల్‌ఐసి లో 100% విదేశీ పెట్టుబడులను వెంటనే వెనక్కి తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాముని గోపాల్ స్వామి, హెచ్‌ఎంఎస్ జాతీయ నాయకుడు సుదర్శన్ రావు, బి ఆర్ టి యు రాష్ట్ర నాయకులు నారాయణ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కృష్ణపురం లక్ష్మణ్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గురువారం కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు సిద్దిపేట జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల ఐక్య కార్యచరణ ఆధ్వర్యంలో స్థానిక చర్చి కాంపౌండ్ నుండి పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక సంఘాలు, కార్మిక చట్టాలు లేని దేశంగా మార్చాలని కార్మికులను నిరాయుదులు చేసి పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు బంగారు పల్లల్లో పెట్టి బహుమానం ఇచ్చేందుకు సిద్ధమైందన్నారు. విరోచితంగా పోరాడి ప్రాణ త్యాగాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి 4 లేబర్ కోడ్ లను 2020లోనే తెచ్చిందనీ వీటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడిన ఫలితంగా ఇంత కాలం వాటిని అమలు చేయకుండా ఆపగాలిగమన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాళ్ల బండి శశిధర్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగర వెంకట్ మావో, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు ఎం పద్మ, అమ్ముల బాల్ నర్సయ్య, జిల్లా సహాయ కార్యదర్శి లు చొప్పరి రవికుమార్, బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు పిండి అరవింద్, దుర్గం శ్రీనివాస్, హెచ్‌ఎంఎస్ జిల్లా అధ్యక్షుడు ఈ దారి మల్లేశం హెచ్‌ఎంఎస్ జిల్లా నాయకులు మధు, కౌసల్య, లలిత తదితరులు పాల్గొన్నారు.