10-12-2025 03:42:34 PM
అడ్డాకుల కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి బొక్కలపల్లి దశరథ రెడ్డి
అడ్డాకుల: మండల గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బొక్కలపల్లి దశరథరెడ్డి మాట్లాడుతూ నా గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామంలో అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. ఎన్నికల ప్రచారం భాగంగా బుధవారం బ్యాట్ బ్యాట్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బహుమతిగా ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో ప్రతి ఒక్కరు కుటుంబంగా కలుపుకొని గ్రామ అభివృద్ధిలో నిలబెడతానని పేర్కొన్నారు.
ముఖ్యంగా గ్రామములో యువకులు ఉపాధి అవకాశం పై ఎక్కువ శ్రద్ధ పెడతానని యువకులకు ఉపాధి చూపించడానికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. గ్రామ ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉండే నాయకుడికి అభివృద్ధి చేసే వారికి ప్రజాపట్టం కట్టాలన్నారు. నన్ను సర్పంచ్ గా గెలిపిస్తే ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అండదండలతో గ్రామాన్ని రాష్ట్రంలోని గ్రామాన్ని ఉత్తమ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని అన్నారు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని గ్రామస్తులను కోరారు.