10-12-2025 03:54:19 PM
అడ్డాకుల: ప్రజలు ఆదరించి సర్పంచిగా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని అడ్డాకుల సర్పంచ్ అభ్యర్థి ఎండి ఖాజా మైనొద్దీన్ అన్నారు. బుధవారం గ్రామంలో పెద్దలు యువకులు నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండి ఖాజా మైనొద్దీన్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ, గ్రామంలో పెద్దలు యువకులు నాయకులు సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తా అన్నారు.
అర్హులైన వృద్ధులు వితంతువులు, అందరికీ పింఛన్లు అందించే విధంగా కృషి చేస్తానని వెల్లడించారు. గ్రామస్తులు ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకొని ప్రజల మధ్యలో ఉండే నాయకుడికి అభివృద్ధి చేసే వారికి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసేవారిని ఆశీర్వదించాలని 17వ తారీకు ఉంగరం గుర్తుపైఓటు వేసి వేయించి గెలిపించాలని గ్రామస్తులను కోరారు