10-12-2025 03:58:11 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని ఖానాపూర్, పెంబి, కడం, దుస్తురాబాద్, మండలాల్లో స్థానిక ఎన్నికల పోలింగ్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ షర్మిల జానకి అన్నారు. బుధవారం స్థానిక బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని వారు సందర్శించారు. గురువారం జరిగే పోలింగ్ కోసం కట్టుదితమైన చర్యలు చేసినట్లు చెప్పారు. పోలింగ్ అధికారుల కు సామాగ్రి అందజేశారు. పోలింగ్ రోజు నిరంతర పర్యవేక్షణ ఉంటుందని వారు అన్నారు. కార్యక్రమంలో తాసిల్దార్ సుజాత రెడ్డి, ఎంపీడీవో రమాకాంత్, ఎం పి ఓ రత్నాకర్ రావు ,అధికారులు పలువురు పాల్గొన్నారు.