calender_icon.png 10 December, 2025 | 5:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్ ఎన్నికల విధుల్లో ముగ్గురు అధికారుల నిర్లక్ష్యం.. సస్పెండ్

10-12-2025 04:01:14 PM

తాండూరు,(విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఉత్తర్వులు బుధవారం బషీరాబాద్ మండల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. కుల్కచర్ల మండలానికి చెందిన పటేల్ చెరువు తండా ఎస్జిటి మానస, నీటూరు ప్రాథమికోన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ నసీం రెహనా లు అదేవిధంగా పెద్దేముల్ ఎంపీపీఎస్ కు చెందిన స్కూల్ అసిస్టెంట్ అన్నపూర్ణ లకు గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అధికారులుగా నియమించడం జరిగింది.  వీరు విధుల్లో బాధ్యతారహితంగా నిర్లక్ష్యం వహించి విధులకు  గైర్హాజరు అయినందున   జిల్లా కలెక్టర్ వీరిని విధుల నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.