calender_icon.png 10 December, 2025 | 4:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్

10-12-2025 03:18:44 PM

ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గంలోని మీర్పేట్ హెబి కాలనీలో స్థానిక కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్ తో కలిసి  కోటి 38 లక్షల ఆరువేల  అంచనా వ్యయంతో  అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను  ఉప్పల్ నియోజకవర్గ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజా సమస్యలే పరిష్కరించడమే తమ ధ్యేయం అన్నారు. డివిజన్లోని  మౌలిక వసతులు  పై ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రేటర్ నాయకులు మాజీ కార్పొరేటర్ గూడారపు శ్రీనివాస్ రెడ్డి బోదాసు రవి  కాప్రా సర్కిల్ అధికారులు పాల్గొన్నారు.