28-05-2025 01:46:24 AM
న్యూఢిల్లీ, మే 27: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో బాంబు పేలుడు కలకలం రేపింది. స్థానిక మజితా రోడ్ బైపాస్ సమీపంలో మంగళవారం జరిగిన పేలుడు ఘటనలో ఓ వ్యక్తి మరణించినట్టు తెలుస్తోంది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. పేలుడు పదార్థం తయారీపై ఫోరెన్సిక్ అధికారులు పరిశీలన చేపట్టారని పోలీసులు వెల్లడించారు.
గ్యాంగ్‌స్టర్లు లేదా ఉగ్రవాదుల ప్రమేయం లేకపోవచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. స్వర్ణ దేవాలయానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఈ పేలుడు సంభవించింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరిస్థితి అదుపులో ఉందని, ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు తెలిపారు.