16 April, 2026 | 11:09 AM

శ్రీహరికోట షార్‌ కేంద్రానికి బాంబు బెదిరింపు

16-06-2025 09:33 AM

అమరావతి: తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్(Satish Dhawan Space Centre)కు బాంబు బెదిరింపు వచ్చింది. చెన్నైలోని సీఐఎస్ఎఫ్ కమాండెంట్ కార్యాలయానికి అర్ధరాత్రి బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. బాంబు బెదిరింపు(Bomb Threat Call ) దృష్ట్యా శ్రీహరి కోటలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. శ్రీహరికోటలోని అడువుల్లో అణువణువూ భద్రతా దళాలు తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల్లో సీఐఎస్ఎఫ్ బృందాలు, పోలీసు బలగాలు పాల్గొన్నాయి. గతంలో కూడా షార్ కేంద్రానికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే.