సూడాన్‌పై బాంబు దాడులు
12-12-2024 12:03 AM
* రెండు రోజుల్లో 100 మందికి పైగా మృతి
ఖర్‌టౌమ్, డిసెంబర్ 11: సూడాన్‌లో సైన్యం, పారా మిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్‌ఎస్‌ఎఫ్) మధ్య 20 నెలల నుంచి సాగుతున్న యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సోమ, మంగళవారాల్లో ఆర్‌ఎస్‌ఎఫ్ కబ్కాబియా ప్రాంతంలోని నార్త్ డార్ఫర్ పట్టణాన్ని టార్గెట్ చేసింది. ఓ మార్కెట్‌పై ఎనిమిది బ్యారెళ్ల బాంబులు వదిలింది. దాడుల్లో 100 మందికి పైగా సాధారణ పౌరులు మృతిచెందారు. వందలాది మంది గాయపడ్డారు. మంగళవారం వరకు అక్కడి అధికారులు 87 మంది మృతదేహాలను గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.






