గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి
* 26 మంది హతం
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ దళాల వరస దాడులతో పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా గాజాలోని టెల్‌అవీవ్‌లో జరిగిన వైమానిక దాడుల్లో 26 మంది పాలస్తీనియన్లు మృతిచెందారు. ఈ విషయాన్ని పాలస్తీనా వైద్యాధికారులు ధ్రువీకరించారు. మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ సరిహద్దులోని బీట్ లాహియాలో దాడులు జరగడంతో జనాలు చెల్లాచెదురయ్యారు. ఈ క్రమంలో ఆయా ప్రజలు ఆశ్రయం పొందుతున్న ఓ ఇంటిపైన కూడా దాడి జరగడంతో 19 మంది మరణించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఉండటం గమనార్హం. మరోవైపు సెంట్రల్ గాజాలోని ఓ శరణార్థి శిబిరంపై జరిగిన దాడిలో ఏడుగురు చనిపోయారు. ఇందులో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు కమాల్ అద్వాన్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా దాడిపై టెల్‌అవీవ్ ఎలాంటి ప్రకటన చేయలేదు.






