తాలిబన్ మంత్రి దుర్మరణం
12-12-2024 12:06 AM
కాబూల్, డిసెంబర్ 11: నగరంలోని ఓ మసీదులో పేలుడు సంభవించడంతో తాలిబన్ మంత్రి ఖలీల్ రెహ్మాన్ దుర్మరణం చెందారు. అతడిని టార్గెట్ చేస్తూ మసీదులో బాంబు పేల్చినట్లు ఈ దుర్ఘటనలో మంత్రి దుర్మరణం చెందినట్లు మంత్రి అల్లుడు తెలిపారు. ఖలీల్ ప్రస్తుతం తాలిబన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఈ ఘటనకు ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ గ్రూప్ బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనలో మంత్రితో పాటు మరో 12 మంది మృతి చెందారు. మసీదులో మధ్యాహ్న ప్రార్థనల సమయంలో ఈ ఘటన జరిగింది. అతడు ఐక్యరాజ్యసమితి మోస్ట్ వాంటెడ్ వ్యక్తుల జాబితాలో ఉన్నాడు. ఖలీల్ మీద 5 మిలియన్ అమెరికన్ డాలర్ల రివార్డు ఉంది.






