26 May, 2026 | 2:47 AM

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి

26-05-2026 01:12 AM

కరీంనగర్, మే 25 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని వా రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా బొమ్మ శ్రీరామ్ చక్ర వర్తి ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి, తనకు మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి శుభాకాంక్షలు తెలిపి, ము న్నూరుకాపు సామాజిక వర్గ అభివృద్ధికి కా ర్పొరేషన్ ద్వారా సంక్షేమ పథకాలను పేదలకు అందించేలా చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు.