రూ. 4.50కోట్ల అవినీతిపై చర్యలు తీసుకోవాలి
26-05-2026 01:11 AM
ముకరంపుర, మే 25 (విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో జరిగిన 4.50కోట్ల అవినీతిపై చర్యలు తీసుకోవాలని ఏఐ ఎఫ్ బి జిల్లా ప్రధాన కా ర్యదర్శి బండారి శేఖర్ కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. 4.50 కోట్ల రూపాయల దుర్వినియోగంపై డబ్బులను రికవరీ చేయించా లని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేయాలని శేఖర్ డిమాండ్ చేశారు.






