18-07-2025 12:09:39 AM
కరీంనగర్, జూలై 17 (విజయ క్రాంతి): నగరంలోని భగత్ నగర్ లోగల అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో గురువారం బోనాల జా తరను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి అమ్మవారి చిత్రపటానికి పూలమాలవేసి వే డుకలను ప్రారంభించారు.భగత్ నగర్ చౌర స్తా నుండి పాఠశాల వరకు బోనాల ఊరేగింపును నిర్వహించారు. వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శించిన నృ త్యాలు, పోతరాజుల విన్యాసాలు అలరించా యి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపా ల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులుపాల్గొన్నారు.