calender_icon.png 19 July, 2025 | 8:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు-కు పోలీసుల ప్రత్యేక చర్య

18-07-2025 12:10:53 AM

జగిత్యాల అర్బన్, జూలై17(విజయక్రాంతి):జిల్లా లో రోడ్డు ప్రమాదాల నివార ణనే లక్ష్యంగా జిల్లా ఎస్పి శఅశోక్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  ప్రయాణం అనే కార్యక్రమo లో బాగంగా జగిత్యాల ప ట్టణం లోని నటరాజ్ థియేటర్  రోడ్డు నుo డి వాహనాలు వచ్చి నేషనల్ హైవే ని కలిసే వద్ద తరచుగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నందున టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ మర యు ట్రాఫిక్ ఎస్.ఐ మల్లేష్ ఆధ్వర్యంలో ప్ర జల భద్రతను దృష్టిలో ఉంచుకుని స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ చర్య వల్ల అధిక వేగంతో వస్తున్న వాహనా లు నియంత్రణలోకి వచ్చి ప్రమాదాల సం ఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుందని అన్నారు. రోడ్డు ప్రమాదల నివారణలో ప్రజలు కూడా భాగస్వాములై ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ రోడ్డు ప్రమాదలను నివా రిచడం లో కృషి చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి పోలీసు లు తీసుకున్న చొరవను స్థానిక ప్రజలుఅభినందించారు.