calender_icon.png 28 October, 2025 | 3:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాభవన్‌లో బోనాల పండుగ

15-07-2024 01:19:21 AM

ఆదివారం బేగంపేట ప్రజాభవన్‌లోని నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ  ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమర్క దంపతులు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం బోనం సమర్పించారు.