calender_icon.png 13 June, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేకల బండి..!

11-06-2025 08:13:16 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలోని శ్రీ ముత్యాలమ్మ తల్లికి బోనాల పండుగ సందర్భంగా ఇనుగుర్తి యాదవులు వినూత్న తరహాలో మొక్కులు సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పండిన పంటల్లో కొంత గంపలతో తీసుకువచ్చి దేవాలయ ప్రాంగణంలో తల్లికి సమర్పించగా, మరికొందరు ప్రత్యేకంగా రూపొందించిన మేకల బండ్లతో తరలివచ్చి మొక్కులు సమర్పించుకున్నారు.